
CHADIVI BADUKARO
చదివి బతుకరో సర్వజనులు మీరు కదిసి నారాయణాష్టాక్షర మిదియే || సాధించి మున్నుశుకుడు చదివినట్టిచదువు వేదవ్యాసులు చదివిన చదువు | ఆదికాలపు వైష్ణవులందరి నోటి చదువు గాదిలి నారాయణాష్టాక్షర మిదియే || సతతము మునులెల్ల చదివినట్టిచదువు వెతదీర బ్రహ్మ చదివిన చదువు | జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు గతిగా నారాయణాష్టాక్షర మిదియే || చలపట్టి దేవతులు చదివినట్టిచదువు వెలయ విప్రులు చదివేటి చదువు | పలుమారు శ్రీ వేంకటపతి నామమై భువి కలుగు నారాయణాష్టాక్షర మిదియే || chadivi batukarO sarvajanulu meeru kadisi naaraayaNaashTaakshara midiyae || saadhiMchi munnuSukuDu chadivinaTTichaduvu vaedavyaasulu chadivina chaduvu | aadikaalapu vaishNavulaMdari nOTi chaduvu gaadili naaraayaNaashTaakshara midiyae || satatamu munulella chadivinaTTichaduvu veta deera brahma chadivina chaduvu | jatanamai prahlaaduDu chadivinaTTi chaduvu gatigaa naaraayaNaashTaakshara midiyae || chalapaTTi daevatulu chadivinaTTichaduvu velayaa vipru lu chadivaeTi chaduvu | palumaaru Sree vaeMkaTapati naamamai bhuvi kalugu naaraayaNaashTaakshara midiyae ||
Chapters
6:32