
Sakala Balambulu Neeve
Audio link :Shobharaju Archive link : సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు అకలంకమగుసుఖమే అన్నిటనిదే నాకు పొందుగ( జక్రాంకితమే బుజబల మిదే నాకు అందినహరి నీచింతే ఆత్మబలము నాకు సందడి( బేరుబలము కేశవనామము నాకు యిందును నందును భవభయ మిక లేదిదే నాకు అంగపు తిరుమణులివి పంచాంగబలము నాకు సంగతి నీపై పాటలె సర్వబలి మిదే నాకు రంగుగ నీగుణరాసులే రాసిబలము నాకు యింగితముగ నిహపరముల కెదురే దిదే నాకు కనుగొను నీవిగ్రహమే గ్రహబలి మిదే నాకు విను నీదాసులసేవే వెనుబలిమిదె నాకు తనరిన శ్రీవేంకటపతి దైవబలము నాకు ఘనమే చెప్పగ నింతటా కలిగెబో యిదే నాకు in english: sakalabalaMbulu nIvE sarwESwarA nAku akalaMkamagusukhamE anniTanidE nAku poMduga( jakrAMkitamE bujabala midE nAku aMdinahari nIchiMtE Atmabalamu nAku saMdaDi( bErubalamu kESavanAmamu nAku yiMdunu naMdunu bhavabhaya mika lEdidE nAku aMgapu tirumaNulivi paMchAMgabalamu nAku saMgati nIpai pATale sarwabali midE nAku raMguga nIguNarAsulE rAsibalamu nAku yiMgitamuga nihaparamula kedurE didE nAku kanugonu nIvigrahamE grahabali midE nAku vinu nIdAsulasEvE venubalimide nAku tanarina SrIvEMkaTapati daivabalamu nAku ghanamE cheppaga niMtaTA kaligebO yidE nAku