Skip to main content.

Poddika Nennadu Vodachuno

ప|| పొద్దికనెన్నడు వొడుచునో పోయిన చెలిరాదాయను | నిద్దుర కంటికిదోపదు నిముషం బొకయేడు || చ|| కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు | నున్నవి ఒయ్యారంబులు నొచ్చిన చూపులును | విన్నదనంబుల మరపులు వేడుక మీరిన యలపులు | సన్నపు జెమటలుదలచిన ఝల్లనె నామనసు || చ|| ఆగిన రెప్పల నీరును అగ్గలమగు పన్నీటను | దోగియుదోగాని భావము దోచిన పయ్యదయు | కాగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు | వేగిన చెలితాపమునకు వెన్నెల మండెడిని || చ|| దేవ శిఖామణి తిరుమల దేవునిదలచిన బాయక | భావించిన యీకామిని భవములోపలను | ఆ విభుడే తానుండిక నాతడె తానెరుగగవలె | ఈవెలదికిగల విరహంబేమని చెప్పుదము || pa|| poddikanennaDu voDucunO pOyina celirAdAyanu | niddura kaMTikidOpadu nimuShaM bokayEDu || ca|| kannula navveDi navvulu gabbitanaMbula mATalu | nunnavi oyyAraMbulu noccina cUpulunu | vinnadanaMbula marapulu vEDuka mIrina yalapulu | sannapu jemaTaludalacina Jallane nAmanasu || ca|| Agina reppala nIrunu aggalamagu pannITanu | dOgiyudOgAni BAvamu dOcina payyadayu | kAgina dEhapu sekalunu kappina puvvula sorabulu | vEgina celitApamunaku vennela maMDeDini || ca|| dEva SiKAmaNi tirumala dEvunidalacina bAyaka | BAviMcina yIkAmini BavamulOpalanu | A viBuDE tAnuMDika nAtaDe tAnerugagavale | Iveladikigala virahaMbEmani ceppudamu ||

Chapters

poddika nennadu vodachun

7:51