
MangaLamu GOviMdunaku
ప మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ, జయజయ చ ఆదికినినాదైనదేవున కచ్యుతున కంభోజణాభున- కాదికూర్మంబై నజగదాధారమూర్తికిని వేదరక్షకునకును సంతతవేదమార్గ విహారునకు బలి- భేదికిని సామాదిగానప్రియవిహారునకు చ హరికి బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా- కరునకును గాత్యాయనీనుతకలితనామునకు చ పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు వేంకటాచలవల్లభునకుమ విశ్వమూర్తికి నీశ్వరునకును పంకజాకుచకుంభకుంకుమ పంకలోలునకు pa maMgaLamu gOviMdunaku jayamaMgaLamu garuDadhvajunakunu maMgaLamu sarvAtmunaku dharmasvarUpunakU, jayajaya ca AdikininAdainadEvuna kacyutuna kaMBOjaNABuna- kAdikUrmaMbai najagadAdhAramUrtikini vEdarakShakunakunu saMtatavEdamArga vihArunaku bali- BEdikini sAmAdigAnapriyavihArunaku ca hariki baramESvarunakunu SrIdharunakunu gAlAMtakunakunu paramapuruShOttamunakunu bahubaMdhadUrunakusuramunistOtrunaku dEvAsuragaNaSrEShThunaku karuNA- karunakunu gAtyAyanInutakalitanAmunaku ca paMkajAsanavaradunaku BavapaMkavicCEdunaku Bavunaku SaMkaruna kavyaktunaku nAScaryarUpunaku vEMkaTAcalavallaBunakuma viSvamUrtiki nISvarunakunu paMkajAkucakuMBakuMkuma paMkalOlunaku