
JAGADAPU CHANAVULA
Audio link : G.BalaKrishnaPrasad జగడపు జనవుల జాజర | సగివల మంచపు జాజర || మొల్లలు దురుముల ముడిచిన బరువున | మొల్లపు సరసపు మురిపెమున | జల్లన బుప్పొడి జాగర బతిపై | చల్లే రతివలు జాజర || భారపు కుచముల పైపైగడు సిం- | గారము నెరపెటి గంధవొడి | చేరువ పతిపై చిందగ బడతులు | సారెకు జల్లేరు జాజర || బింకపు గూటమి పెనగేటి చమటల | పంకపు పూతలపరిమళము | వేంకటపతిపై వెలదులు నించేరు | సంకుమదంబుల జాజర || jagaDapu janavula jaajara | sagivala maMchapu jaajara || mollalu durumula muDichina baruvuna | mollapu sarasapu muripemuna | jallana buppoDi jaagara batipai | challae rativalu jaajara || bhaarapu kuchamula paipaigaDu siM- | gaaramu nerapeTi gaMdhavoDi | chaeruva patipai chiMdaga baDatulu | saareku jallaeru jaajara || biMkapu gooTami penagaeTi chamaTala | paMkapu pootala parimaLamu | vaeMkaTapatipai veladulu niMchaeru | saMkumadaMbula jaajara || priya sisters , video
Chapters
4:32