Skip to main content.

Chandamamaravo

Audio link : G.BalaKrishnaPrasad Audio link :  Archive link : Raga : Chakravakam, composer : G.Balakrishnaprasad చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥ నగుమోము చక్కనయ్యకు నలువపుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి॥ తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు కలికిచేతల కోడెకు మా కతలకారి ఈబిడ్డకు కులముద్దరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు నిలువెల్ల నిండబొయ్యారికి నవనిధుల చూపుల చూచేసుగుణునకు॥ సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి నెరవాది బుద్దుల పెద్దకు మా నీటు చేతల పట్టికి విరుల వింటివాని అయ్యకు వేవేలురూపుల స్వామికి సిరిమించునెరవాది జాణకు మా శ్రీ వేంకటనాధునికి॥

Chapters

raavo

3:29

Chandamamaravo - Annamayya Ma

4:38