
ANTARYAMI
Audio link :SPB Audio link :NookalaChinaSatyanarayana Audio link :Malladibrothers Archive link : ప|| అంతర్యామి అలసితి సొలసితి | ఇంతట నీ శరణిదె జొచ్చితిని || చ|| కోరిన కోర్కులు కోయని కట్లు | తీరవు నీవవి తెంచక | భారపు బగ్గాలు పాప పుణ్యములు | నేరుపుల బోనీవు నీవు వద్దనక || చ|| జనుల సంగముల జక్క రోగములు | విను విడువవు నీవు విడిపించక | వినయపు దైన్యము విడువని కర్మము | చనదది నీవిటు శాంతపరచక || చ|| మదిలో చింతలు మైలలు మణుగులు | వదలవు నీవవి వద్దనక | ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె | అదన గాచితివి అట్టిట్టనక || pa|| aMtaryAmi alasiti solasiti | iMtaTa nI SaraNide joccitini || ca|| kOrina kOrkulu kOyani kaTlu | tIravu nIvavi teMcaka | BArapu baggAlu pApa puNyamulu | nErupula bOnIvu nIvu vaddanaka || ca|| janula saMgamula jakka rOgamulu | vinu viDuvavu nIvu viDipiMcaka | vinayapu dainyamu viDuvani karmamu | canadadi nIviTu SAMtaparacaka || ca|| madilO ciMtalu mailalu maNugulu | vadalavu nIvavi vaddanaka | eduTane SrI veMkaTESvara nIvade | adana gAcitivi aTTiTTanaka || Malladi brothers
Chapters
9:31