Skip to main content.

ANNITANU JANAkatte vaitive

అన్నిటాను జాణకత్తె వైతివే నీవు కిన్నెరమీటుల నెంత గిలిగించేవే చెలువము లొకవంక చిరునవ్వు లొకవంకఁ జిలుకుతా వల పెంత చిమ్మిరేచేవే తలుపు మాటున నుండి తరితీపులెల్లాఁజేసి చెలువుని యెదుట సిగ్గులెంతచూపేవే పొదలుఁజూపుల కొంత బొమ్మజంకెనలఁ కొంత సదరానఁ బతి నెంతసాదించేవే వదలుఁబయ్యద చేత వన్నెలమోవిచేత యెదురెదురనే యంత యెలయించేవే చిప్పిలుఁజెమట తోడ శిరసువొంపులతోడ ముప్పిరిఁదమక మెంతమూట గట్టేవే యిప్పుడే శ్రీవేంకటేశుడేలె నలమేల్మంగవు  కొప్పుజారె నింకా నెంత కొసరఁజూచేవే anniTAnu jANakatte vaitivE nIvu kinneramITula neMta giligiMchEvE cheluvamu lokavaMka chirunavvu lokavaMka@M jilukutA vala peMta chimmirEchEvE talupu mATuna nuMDi taritIpulellA@MjEsi cheluvuni yeduTa sigguleMtachUpEvE podalu@MjUpula koMta bommajaMkenala@M koMta sadarAna@M bati neMtasAdiMchEvE vadalu@Mbayyada chEta vannelamOvichEta yedureduranE yaMta yelayiMchEvE chippilu@MjemaTa tODa SirasuvoMpulatODa muppiri@Mdamaka meMtamUTa gaTTEvE yippuDE SrIvEMkaTESuDEle nalamElmaMgavu  koppujAre niMkA neMta kosara@MjUchEvE

Chapters

034.ANNITANU JANA

5:49