Entha Vibhavamu Kalige


Audio link :G.BalaKrishnaPrasad Archive link : Ragam : Sudhdhasaveri, Composer : G.Balakrishnaprasad ఎంత విభవము కలిగె నంతయును నాపదని | చింతించినది కదా చెడని జీవనము || చలము కోపంబు తను చంపేటి పగతులని | తెలిసినది యది కదా తెలివి || తలకొన్న పరనింద తనపాలి మృత్యువని | తొలగినది యది కదా తుదగన్నఫలము || మెఱయు విషయములే తన మెడనున్న వురులుగా | యెరిగినది యది కదా యెరుక || పఱివోని ఆస తను బుట్టుకొను భూతమని | వెరచినది యది కదా విజ్ఞాన మహిమ || యెనలేని తిరువేంకటేశుడే దైవమని | వినగలిగినది గదా వినికి|| అనయంబు నతని సేవానందపరులయి |మనగలిగినది గదా మనుజులకు మనికి || in english: eMta vibhavamu kalige naMtayunu nApadani | chiMtimchinadi kadA cheDani jIvanamu || chalamu kOpambu tanu chaMpETi pagatulani | telisinadi yadi kadA telivi talakonna paraniMda tanapAli mRtyuvani | tolaginadi yadi kadA tudagannaphalamu || me~rayu vishayamulE tana meDanunna vurulugA| yeriginadi yadi kadA yeruka pa~rivOni Asa tanu buTTukonu bhUtamani | veracinadi yadi kadA vij~nAna mahima || yenalEni tiruvEMkaTESuDE daivamani | vinagaliginadi gadA viniki anayaMbu natani sEvAnaMdaparulayi | managaliginadi gadA manujulaku maniki || లోకంలో సర్వసాధారణంగా మానవులు సంపదలపై మోహం పెంచుకుని, అవి వృద్ధి చెందుతున్నప్పుడు వాటిని చూసి గర్వపడతారు; మరియు అహంకారంతో విర్రవీగుతారు. కాని ఇక్కడ అన్నమయ్య ఆ మాయాసిరులన్నీ మన మెడలకు తగులుకొన్న ఉరిత్రాళ్ళుగా వర్ణిస్తున్నారు. మనకు లభించే భౌతిక భోగాలన్నీ అశాశ్వతాలనీ, ఆపదలకు మూలాలనీ తెలుసుకొనటమే నిజమైన జీవితం, అనీ, సత్యదృష్టి అనీ ఈ పాటలో చక్కగా తెలియజేస్తున్నాడు! అరిషడ్వర్గాలను విడిచిపెట్టాలని, పరనింద చేయరాదని, విషయ వాంఛలను విడనాడాలని, ఆశలను ఆమడదూరంలో పెట్టాలని బోధిస్తున్నాడు! వీటన్నిటి యదార్ధ స్వరుపం తెలుసుకున్నవాడు విజ్ఞాని అని, నొక్కి వక్కాణిస్తున్నాడు! తిరుగులేని తిరువేంకటేశ్వరుడు శాశ్వత సత్యమని, దైవమని తెలుసుకొని నిరంతరం ఆ స్వామి సేవలో తరించాలని ఉద్భోధిస్తున్నాడుు మన గురువు అన్నమయ్య! GB. Sankara Rao gari vivarana from sujanaranjani , siliconandhra.org విభవము = సంపద; చలము = మాత్సర్యము; పగతులు = శత్రువులు తలకొన్న = కలిగిన; తుదగన్న ఫలము = పరమావధి నొందిన ఫలము; విషయములు = శబ్ద స్పర్శ రూపాదులు; పఱివోని = చీలిపోని, తగ్గని ఎనలేని = సాటిలేని; అనయంబు = అత్యంతము, సతతము