Medini Jeevulagana


Audio link :Yesudas Audio link :Vanijayaram Archive link : మేదిని జీవుల గావ మేలుకోవయ్యా - నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా తగు గోపికల కన్ను దామరలు వికసించె - మిగులు సూర్యనేత్రుడ మేలుకోవయ్యా తెగువ రాక్షసులనే తిమిరము విరియగ - నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ఘనదురితపు గలువలు వికసించె - మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ - జనక ! యాశ్రితపారిజాతమేలుకోవయ్యా వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ - మెరయుదోషరహిత మేలుకోవయ్యా పొరసి నీవు నిత్యభోగములు భోగించ - నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా maedini jeevula gaava maelukOvayyaa - needayae maakella raksha nidra maelukOvayyaa tagu gOpikala kannu daamaralu vikasiMche - migulu sooryanaetruDa maelukOvayyaa teguva raakshasulanae timiramu viriyaga - negaDina paraMjyOti nidra maelukOvayyaa ghanaduritapu galuvalu vikasiMche - minuku SaSinaetruDa maelukOvayyaa panivaDi vaedaalanae pakshulellaa balukaga - janaka ! yaaSritapaarijaatamaelukOvayyaa varalakshmee kuchachakravaakamu loMDoMTi raaya - merayudOsharahita maelukOvayyaa porasi neevu nityabhOgamulu bhOgiMcha - nirati SreevaeMkaTaeSa naeDu maelukOvayyaa