
E Mta Chadivina N Emi Viniva
Audio link : Archive link : ప|| ఎంత చదివిన నేమి వినిన తన | చింత యేల మాను సిరులేల కలుగు || చ|| ఇతర దూషణములు ఎడసిన గాక | అతి కాముకుడు గాని యప్పుడు గాక | మతి చంచలము కొంత మానిన గాక |గతి యేల కలుగు దుర్గతులేల మాను || చ|| పర ధనముల యాస బాసిన గాక | అరిది నిందలు లేని యప్పుడు గాక | విరస వర్తనము విడచిన గాక | పర మేల కలుగు నాపద లేల మాను || చ|| వేంకటపతి నాత్మ వెదికిన గాక | కింక మనసున తొలగిన గాక | బొంకు మాటలెడసి పోయిన గాక | శంక యేల మాను జయమేల కలుగు || pa|| eMta cadivina nEmi vinina tana | ciMta yEla mAnu sirulEla kalugu || ca|| itara dUShaNamulu eDasina gAka | ati kAmukuDu gAni yappuDu gAka | mati caMcalamu koMta mAnina gAka |gati yEla kalugu durgatulEla mAnu || ca|| para dhanamula yAsa bAsina gAka | aridi niMdalu lEni yappuDu gAka | virasa vartanamu viDacina gAka | para mEla kalugu nApada lEla mAnu || ca|| vEMkaTapati nAtma vedikina gAka | kiMka manasuna tolagina gAka | boMku mATaleDasi pOyina gAka | SaMka yEla mAnu jayamEla kalugu ||
Chapters
eMta sadivina nEmi viniva | 5:59 |