BRAHMA POOJINCHE RAGHUPATHI


బ్రహ్మపూజించే రఘుపతి విభీషుణు కిచ్చె బ్రహ్మణ్యుడీ రంగపతి గొలువరో కావేరీ మధ్య రంగక్షేత్ర మల్లదిగో శ్రీవిమాన మదిగో శేషపర్యంక మిదె దేవు(డల్లదె వాడే దేవి శ్రీలక్ష్మి యదె సేవించరో నాభి( జిగురించె నతడూ యేడు గోడలు నవిగో యెసగు పూదోపు లవె కూడి దామోదరపురగోపుర మదె తోడ వేయిగంబాల దొడ్డమంటప మదిగో చూడరో పసిడిమించులకంబ మదిగో ఆళువారులు వారే యంగరంగవిభవమదె వాలు శ్రీవైష్ణవపు వాడ లవిగో ఆలీల శ్రీవేంకటేశుడై వర మిచ్చీని తాలిముల శ్రీరంగ దైవము గొలువరో brahmapUjiMchE raghupati vibhIShuNu kichche brahmaNyuDI raMgapati goluvarO kAVErI madhya raMgakshEtra malladigO SrIvimAna madigO SEshaparyaMka mide dEvu(Dallade vADE dEvi SrIlakshmi yade sEViMcharO nAbhi( jiguriMche nataDU yEDu gODalu navigO yesagu pUdOpu lave kUDi dAmOdarapuragOpura made tODa vEyigaMbAla doDDamaMTapa madigO chUDarO pasiDimiMchulakaMba madigO ALuvArulu vArE yaMgaraMgavibhavamade vAlu SrIvaishNavapu vADa lavigO AlIla SrIvEMkaTESuDai vara michchIni tAlimula SrIraMga daivamu goluvarO